వ్యక్తిగత పరిశుభ్రత ద్వారానే కరోనా వైరస్ను నియంత్రించవచ్చని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ స్పష్టం చేశారు. కోడుమూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన...మౌలిక సౌకర్యాలపై ఆరా తీశారు. విపత్కర సమయంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, పాత్రికేయులు సమాజ హితం కోసం సేవ చేస్తున్నారని కొనియాడారు. లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఇళ్లలో ఉండే వాళ్లు శుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. సామాజిక దూరం ద్వారా వైరస్ను కట్టడి చేయవచ్చన్నారు.
'విపత్కర సమయంలో వారి సేవలు చిరస్మరణీయం'
కరోనా విజృంభిస్తున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, పాత్రికేయుల సేవలు చిరస్మరణీయమని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కొనియాడారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించటం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు.
వారి సేవలు చిరస్మరణీయం