ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళాశాలలో రూ.40 లక్షలు విలువైన కంప్యూటర్ల పరికరాలు చోరీ - పాణ్యం మండలంలోని ఆర్​జీఎన్ ఇంజనీరింగ్ కళాశాల వార్తలు

పాణ్యం మండలంలోని ఆర్​జీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో భారీ దొంగతనం జరిగింది. దాదాపు 350 కంప్యూటర్లలో రామ్​లను దుండగులు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన పరికరాల విలువ సుమారు రూ. 40 లక్షలుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Theft of computers material
కంప్యూటర్ల పరికరాలు చోరీ

By

Published : Jan 9, 2021, 7:33 PM IST

కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని ఆర్​జీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ల పరికరాలు చోరీకి గురయ్యాయి. నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దాదాపు 350 కంప్యూటర్లలో రామ్​లు దుండగులు ఎత్తుకెళ్లారు. వాటివిలువ సుమారు రూ.40 లక్షల ఉంటుందని పోలీసులు తెలిపారు. నిఘానేత్రాల సాయంతో నిందితులను గుర్తిస్తామని పేర్కొన్నారు. జాగిలాల సాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ABOUT THE AUTHOR

...view details