ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెప్పుల దుకాణంలో చోరీ.. బంగారం, నగదు మాయం - Theft in sandal shop - gold, cash eaten

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భారీ చోరీ జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ చెప్పుల దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్లు పగలగొట్టి 30 తులాల బంగారం, లక్ష రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..

Theft in sandal shop - gold, cash eaten
చెప్పుల దుకాణంలో చోరీ-బంగారం,నగదు మాయం

By

Published : Sep 3, 2020, 10:57 AM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు ధనుంజయ గౌడ్ అనే చెప్పుల వ్యాపారి తన దుకాణంలో టేబుల్ డ్రాయర్​లో బంగారం, నగదు ఉంచి ఇంటికి వెళ్ళిపోయారు. వేకువజామున షట్టర్లుతెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు దుకాణ యజమానికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన అక్కడికి చేరుకొని చూడగా టేబుల్ డ్రాయర్ లోని బంగారం, నగదు మాయమైంది. స్థానిక పోలీసుల గౌడ్ సమాచారం అందించారు. ఘటనా స్థలిని సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై రామిరెడ్డి పరిశీలించారు.

అధిక మొత్తంలో బంగారం, నగదును ఇంట్లోకాకుండా దుకాణంలో దాచుకోవడం పై అనుమానాలను వ్యక్తం చేశారు. దుకాణం సమీపంలోని సీసీ కెమెరాలను ఆధారాల కోసం పోలీసులు పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం సాయంతో వేలిముద్రలను సేకరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకునే చర్యలు ప్రారంభించినట్లు సీఐ వ€తెలిపారు. ధనుంజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి: కర్నూలులో తగ్గని కరోనా ఉద్ధృతి.. కొత్తగా 697 కేసులు

ABOUT THE AUTHOR

...view details