కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శ్రీలక్ష్మీ నరసింహా జువెల్లర్స్ దుకాణంలో చోరీ జరిగింది. శ్రీరామాంజనేయస్వామి దేవాలయానికి పక్కనే బంగారు దుకాణం ఉంది. ఆలయ ప్రహరీని పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు బంగారు దుకాణంలోని ప్రవేశించారు. రూ.12లక్షల రూపాయల నగదు, నాలుగున్నర తులాల బంగారం, అర కిలో వెండిని ఎత్తుకెళ్లారు. దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రక్కకు తిప్పి దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆలయ ప్రహరీ ధ్వంసం చేసి.. బంగారు దుకాణంలో చోరీ - ఎమ్మిగనూరులో చోరీ
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ప్రహరీ ధ్వంసం చేసి బంగారు దుకాణంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బంగారు దుకాణంలో చోరీ