కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భారీ చోరీ జరిగింది. ఓబులేసు అనే వ్యక్తి ఇంట్లో 10 తులాల బంగారం దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి నగర్లో నివాసం ఉండే ఓబులేసు మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటి వచ్చాడు. ఇంటి తలుపులు తీసి లోపలికి వెళ్లగా బీరువా తాళం పగలగొట్టి ఉంది. 10 తులాల బంగారం చోరీ జరిగిందని బాధితుడు గుర్తించాడు. అతని ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Theft Case: బయటికి వెళ్లొచ్చేలోగా..బంగారం దోచేశారు - ఆదోనిలో చోరి
కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ చోరీ జరిగింది. ఓబులేసు అనే వ్యక్తి ఇంట్లో 10 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ చోరీ