ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో వరుస చోరీలు.. ఆందోళనలో ప్రజలు - Theft at Sharin Nagar shops news

కర్నూలులోని షరీన్​నగర్​లో దొంగలు హల్​చల్​ సృష్టించారు. 44వ నంబరు జాతీయ రహదారి పక్కన నాలుగు దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. షాపుల్లో ఉన్న నగదు, విలువైన వస్తువులు దోచుకెళ్లారు.

Theft at Sharin Nagar shops
దుకాణాల్లో చోరీ

By

Published : Feb 8, 2021, 6:28 PM IST

కర్నూలులోని షరీన్​నగర్​లో 44వ నంబరు జాతీయ రహదారి పక్కన 4 దుకాణాల్లో చోరీ జరిగింది. ముబారక్ మొబైల్ షాపు తాళం పగులకొట్టి దొంగతనం చేశారు. దుకాణంలో ఉన్న రూ.60 వేలు నగదు, రూ.40 వేలు విలువైన సెల్ ఫోన్లు, విడిభాగాలు చోరీ అయినట్లు బాధితుడు తెలిపాడు. అక్కడున్న సీసీ కెమెరాల వైర్లు కత్తిరించి వెళ్లిపోయారని చెప్పాడు.

సమీపంలోని ఏ జెడ్ మెడికల్ షాపు, తిరుమల, శ్రీనివాస పాల డెయిరీల్లోనూ దొంగలు చొరబడ్డారు. వాటిల్లో రూ.30 వేలు అపహరణకు గురయ్యాయి. మరో మెడికల్, జిరాక్స్ షాపుల్లో చోరీకి విఫలయత్నం చేశారు. దొంగతనం జరిగిన దుకాణాలను పోలీసులు పరిశీలించారు. ఒక్కడే కారులో వచ్చి దొంగతనం చేసినట్లు సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. కానీ వాహనంలో మరికొంత మంది ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షేక్​నూర్​ అహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details