కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బల్గోట గ్రామంలో బసవేశ్వర ఆలయంలో దొంగతనం జరిగింది. ఆలయంలో ఉన్న 3 హుండీలు, 10 తులాల వెండి, 10 తులాల పంచలోహ విగ్రహాలు, రూ. 1.50 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాలను సైతం తీసుకువెళ్లినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు క్లూస్ టీంతో విచారణ చేపట్టారు.
ఆలయంలో చోరీ... సీసీ కెమెరాలను సైతం ఎత్తుకెళ్లిన దుండగులు - Theft at Basaveshwara Temple in Balgota latestnews
కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బల్గోట బసవేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. హుండీలో ఉన్న నగదు, ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలతో సహా దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు క్లూస్ టీంతో విచారణ చేపట్టారు.
ఆలయంలో చోరీ... సీసీ కెమెరాలను సైతం ఎత్తుకెళ్లిన దుండగులు