కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో పొన్నాపురం వద్ద రైలు ఢీకొని మనోహర్ (22) అనే యువకుడు మరణించాడు. రైల్వే ట్రాక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి రైలు ఇంజన్ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రైలు నడిపే వ్యక్తి హారన్ కొట్టి ఆ యువకుడిని అప్రమత్తం చేయాలని ప్రయత్నించినా.. అతను చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవటం వల్ల వినిపించుకోలేకపోయాడు.
నిర్లక్ష్యంగా రైల్వే ట్రాక్‌పై నడక.. యువకుడు మృతి - The young man died in the train accident news
చిన్నపాటి నిర్లక్ష్యం.. ఓ యువకుడి నిండు ప్రాణం బలికొంది. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైల్వేట్రాక్‌పై నడుస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదకరమైన ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు పాటించకపోవటమే ప్రాణాలు పోవడానికి కారణమైంది. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో పొన్నాపురం వద్ద ఈ ఘటన జరిగింది.
రైల్వే ట్రాక్ వద్ద యువకుడు జాగ్రత్తగా ఉండి ఉంటే ప్రమాదం నుంచి బయటపడేవాడు. అతని నిర్లక్ష్యానికి ప్రాణాలనే మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు కడప జిల్లా బద్వేల్‌కు చెందినవాడిగా గుర్తించామన్నారు. ఇటీవల బీటెక్ పూర్తి చేసి, బ్యాంకు కోచింగ్ కోసం నెల రోజుల క్రితమే నంద్యాలలోని ఓ ఇనిస్టిట్యూట్‌లో చేరినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:కర్నూలులో విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య