మూడు రోజుల క్రితం తుంగభద్ర నదిలో గల్లంతైన సింధుజా రెడ్డి అనే మహిళ మృతదేహం లభ్యమైంది. కర్నూలు నగరంలోని సంకల భాగ్ వద్ద ఉన్న తుంగభద్ర నది ఒడ్డుకు మృతదేహాన్ని చేర్చిన అగ్నిమాపక సిబ్బంది.. కుటుంబ సభ్యులకు చూపించారు. అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం కర్నూలుకు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు.
శనివారం సింధుజారెడ్డి తన భర్త శివకుమార్రెడ్డితో కలిసి కారులో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా.. జోగులాంబ గద్వాల జిల్లా వద్ద కలుగొట్ల వాగులో వీరి కారు గల్లంతయ్యింది. ఈ ఘటనలో భర్త బయటపడగా.. సింధుజారెడ్డి నదిలో కొట్టుకుపోయింది.