గత ఎనిమిది నెలలుగా అద్దె చెల్లించడం లేదని కర్నూలు జిల్లా నందికొట్కూరు పురపాలక పరిధిలో ఓ ఇంటి యజమాని 14వ సచివాలయానికి తాళం వేశారు. నందికొట్కూరు పురపాలకలో వార్డు సచివాలయాలు 3 సొంత భవనాల్లో, 11 సచివాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 11 సచివాలయాలకు గత ఎనిమిది నెలలుగా అద్దె చెల్లించలేదు. వీటికి 4 లక్షల 50 వేల రూపాయలు పెండింగ్లో ఉన్నట్లు పురపాలక మేనేజర్ బేబీ తెలిపారు. జిల్లాలోని కర్నూలు కార్పొరేషన్, నంద్యాల, ఆదోని, డోన్, ఎమ్మిగనూరు, నందికొట్కూరు మున్సిపాలిటీలలో ఆళ్లగడ్డ, గూడూరు, ఆత్మకూరు నగర పంచాయతీలో భవనాలకు అద్దె చెల్లించడం లేదు.
చెల్లించని అద్దె..వార్డు సచివాలయానికి ఇంటి యజమాని తాళం - 14వ వార్డు సచివాలయం 14వ వార్డు సచివాలయం వార్తలు
అద్దె చెల్లించట్లేదని ఓ వార్డు సచివాలయానికి ఆ ఇంటి యజమాని తాళం వేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరు పురపాలక పరిధిలో జరిగింది.
అద్దె చెల్లించట్లేదని వార్డు సచివాలయానికి తాళం వేసిన ఇంటి యజమాని