ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈ విధానం విజయవంతం అయితే మరిన్ని వాహనాలు ఏర్పాటు చేస్తాం' - తానా, మహీంద్ర కంపెనీ విరాళం

కర్నూలు నగర పాలక సంస్థకు.. తానా, మహీంద్ర కంపెనీ విరాళంగా ఇచ్చిన వాహనాలను కర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ వాహనాలు ఇళ్ల నుంచి చెత్తను తీసుకొని నేరుగా డంప్ యార్డ్​కు వెళుతాయని కమిషనర్ తెలిపారు.

tana and mahindra donation
తానా, మహీంద్ర కంపెనీ విరాళం

By

Published : Jan 6, 2021, 8:43 AM IST

కర్నూలు నగరాన్ని స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్పారు. నగర పాలక సంస్థకు తానా, మహీంద్ర కంపెనీ విరాళంగా ఇచ్చిన చెత్తను తరలించే 2 వాహనాలను ఎమ్మెల్యేలు, నగరపాలక సంస్థ కమిషనర్ బాలజీతో కలసి ప్రారంభించారు.

ఈ వాహనాలు ఇంటింటికి వెళ్లి తడిచెత్త, పొడిచెత్తను తీసుకొని నేరుగా డంప్ యార్డ్​కి వెళ్తాయని కమిషనర్ తెలిపారు. ఈ విధానం విజయవంతం అయితే.. త్వరలోనే మరిన్ని వాహనాలను ఏర్పాటు చేసి నగరం మొత్తం చెత్తను తరలిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details