శిథిలావస్థకు చేరిన ఓ పాఠశాల భవనం కర్నూలు జిల్లా నంద్యాలలోనిది. ఈ పాఠశాల భవనం పైకప్పు తరుచూ పెచ్చులుడుతూ పిల్లలను, ఉపాధ్యాయులను భయాందోళనకు గురి చేస్తోంది. ప్రమాదం పొంచి ఉన్న ఆ పాఠశాలలో అలానే తరగతులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది.
నంద్యాల క్రాంతినగర్‌లో ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకుకు చేరుకుంది. పాఠశాల పైకప్పు పెచ్చులూడుతోంది. తరగతులు జరిగే క్రమంలో పిల్లలు, ఉపాధ్యాయులు భయపడుతున్నారు.
2014 నుంచి ఇక్కడ పని చేస్తున్నాను. ఈ పాఠశాల గురించి సర్వశిక్షా అభియాన్ వాళ్లు వచ్చి చూశారు. పాఠశాలను బాగు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు. వర్షాకాలం వచ్చిందంటే పాఠశాల భవనం పెచ్చులు ఊడిపోతుంటాయి. ఈ కారణంగానే మా పాఠశాలలో పిల్లల్ని తల్లిదండ్రులు చేర్పించట్లేదు. -కామేశ్వరమ్మ, ఉపాధ్యాయురాలు, క్రాంతినగర్, నంద్యాల