కర్నూలు జిల్లా రుద్రవరం మండలం దువ్వపల్లికి చెందిన చిన్నక్క అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఎద్దులబండిపై కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. గతేడాది సెప్టెంబర్ నెలలో పెన్షన్ ఇచ్చారు. ఆ
తర్వాత నెల నుంచి ఆమెకు పెన్షన్ రావటం లేదు. ఒకే పేరుతో రెండు ఆధార్ నంబర్లు ఉన్నాయని... పింఛన్ నిలిపివేశారు. నడవలేని కారణంగా... కుమారుడి ఎడ్ల బండిపై ఎండీఓ కార్యాలయం, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తనకు పెన్షన్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.
2 ఆధార్ నంబర్లు ఉన్నాయని... పింఛన్ ఆపేశారు! - కర్నూలు జిల్లా వార్తలు
అసలే వృద్ధురాలు.. అపై చిన్న చిన్న అవసరాల కోసం పదో పరకో ఎవరిని అడగాలన్నా ఇబ్బందే. ఇలాంటి తరుణంతో నెలవారీ ఖర్చుల కోసం ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లే వారికి ఆధారం. కానీ.. ప్రభుత్వం ఆమెకు రెండు ఆధార్ కార్డులున్నాయనే కారణంతో పెన్షన్ నిలిపేసింది. ఈ కారణంగా.. 80 ఏళ్ల వయసులో ఆ దీనురాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన దుస్థితి ఏర్పడింది.

దువ్వపల్లిలో వృద్దురాలి పెన్షన్ నిలిపివేత
ఇదీ చదవండి: