కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. జిల్లాలో 533 కేసులు నమోదు కాగా.. అందులో అత్యధికంగా కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 338, నంద్యాల మున్సిపాలిటీ పరిథిలో 105 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జిల్లాలో కొత్తగా 17 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 14, నంద్యాల మున్సిపాలిటీ పరిధి, కోడుమూరు, పగిడ్యాలలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా నుంచి 153 మంది కోలుకోగా, 11 మంది మరణించారు.
కర్నూలు జిల్లాలో 533కు చేరిన కొవిడ్ పాజిటివ్ కేసులు
కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. కర్నూలు నగరం, నందికొట్కూరులోనే అధిక సంఖ్యలో నమోదవడం అధికారులు, స్థానికులకును ఆందోళన కలిగిస్తోంది.
కర్నూలు జిల్లాలో 533కు చేరిన కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య