కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో యాభై ఎకరాల భూమిని వైద్యకళాశాలకు కేటాయింపును నిరసిస్తూ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఇంటిని సీఐటీయూ నాయకులు, వ్యవసాయ కార్మికులు ముట్టడించారు. వైద్య కళాశాలకు ప్రత్యహ్నయంగా మరో చోట భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భూ బదలాయింపు..
ఈ నేపథ్యంలో ఎంపీ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. భూముల బదలాయింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఎంపీ భూ బదలాయింపు నిర్ణయం ఇంకా పరిశీలనలోనే ఉందన్నారు. ఈ క్రమంలో బాధితులు, సంఘం నేతలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : రహదారులు అధ్వానం.. ప్రయాణంలో ఒళ్లు హూనం