కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేటలో విద్యుత్ తీగలు వ్యక్తి మృతిచెందాడు. గ్రామానికి చెందిన చిన బాలనాయుడు అనే వ్యక్తి పొలంలో గేదెలను మేపుతుండగా కిందపడిన తీగలు ప్రమాదవశాత్తూ తగిలాయి. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి - ఇల్లూరు కొత్తపేటలో విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి
పశువులను మేపుతుడంగా కిందపడిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతిచెందిన ఘటన కర్నూలు జిల్లా ఇల్లూరు కొత్తపేటలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి