ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. పక్కింటి దంపతులే నిందితులు! - karnulu boy kidnapp news

వారు కొన్ని నెలలుగా ఇంటి పక్కనే నివాసం ఉంటున్నారు. బాలుడితో స్నేహం నటించారు. ఎంచక్కా అనుమానం రాకుండా కిడ్నాప్ చేశారు. పోలీసుల దర్యాప్తులో దొరికిపోయారు. భిక్షాటన, దొంగతనం చేయడానికి బాలుడిని అపహరించినట్లు తెలుస్తోంది.

boy kidnap
boy kidnap

By

Published : Apr 24, 2021, 9:56 PM IST

కర్నులు జిల్లాలో కిడ్నాప్​కు గురైన 5 సంవత్సరాల బాలుడిని కర్నూలు పోలీసులు చాకచక్యంగా గుర్తించారు. స్వామి నగర్​కు చెందిన దేవి కుమారుడు నాని ఈ నెల 19న కిడ్నాప్ కు గురయ్యాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

స్నేహంగా ఉంటూనే...

కొన్ని నెలలుగా ఇంటి పక్కనే స్నేహంగా ఉంటున్న నాగమణి, హరికృష్ణ దంపతులు బాలుడిని అపహరించారు. కిడ్నాప్ చేసి బాలుడిని డోన్ పట్టణంలోని మురళి అనే వ్యక్తి వద్ద ఉంచారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం ఇంటి పక్కన ఉన్న వారే అపహరించారని గుర్తించి అరెస్టు చేశారు. బిక్షాటన, దొంగతనాలకు పాల్పడడంలో శిక్షణ ఇవ్వడం కోసమే.. బాలుడిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై.. విచారణ చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:

అమెరికన్‌ డాలర్ల పేరిట మోసం.. రూ.16 లక్షలు మాయం

ABOUT THE AUTHOR

...view details