కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దంపతులు పెట్రోలు, పురుగుల మందు చేతపట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రమాదేవి, ఆమె భర్త వెంకటసుబ్బారెడ్డి... తమ ఇంటి స్థలం పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగారు. ఎన్నిసార్లు తిరిగినా... అధికారులు తమ సమస్యను పట్టించుకోలేదని ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు కూర్చొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని తహసీల్దార్ శివరాముడు వారికి హామీ ఇచ్చారు.
సమస్య పరిష్కరించలేదని దంపతుల ఆత్మహత్యాయత్నం - ఇంటి సమస్య పరిష్కారం కోసం దంపతులు ఆత్మహత్యాయత్నం
తమ ఇంటి స్థలం సమస్య పరిష్కరించలేదని దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తహసీల్దారు కార్యాలయం ఎదుట జరిగింది.
ఇంటి సమస్య పరిష్కారం కోసం దంపతులు ఆత్మహత్యాయత్నం