ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తగ్గిన వరద...శ్రీశైలం, సాగర్ నుంచి దిగువకు నీటి విడుదల - Srisailam and Sagar reservoirs news

శ్రీశైలం, సాగర్​ జలాశయాలకు వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

The flood flow to Srisailam and Sagar reservoirs continues slightly.
శ్రీశైలం, సాగర్ నుంచి దిగువకు నీటి విడుదల

By

Published : Sep 13, 2020, 10:07 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. ఇన్ ఫ్లో 1,05,258 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ఆనకట్ట 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు స్పిల్‌వే ద్వారా 1,11,748 క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగులు కాగా... ప్రస్తుతం నీటినిల్వ 213.88 టీఎంసీలగా కొనసాగుతోంది. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరుగుతోంది. విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 30,880 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు 35,000 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 1899 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

  • నాగార్జునసాగర్‌కు

నాగార్జునసాగర్‌కు క్రమేపీ వరద ప్రవాహం తగ్గుతోంది. సాగర్ 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జునసాగర్‌కు ఇన్ ఫ్లో 1,15,129 క్యూసెక్కులు కాగా.... ఔట్ ఫ్లో 1,15,129 క్యూసెక్కులుగా ఉంది. సాగర్‌లో ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులు కొనసాగుతుండగా...పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. సాగర్‌లో ప్రస్తుత నీటినిల్వ 312.25టీఎంసీలు కాగా...పూర్తిస్థాయి సామర్ధ్యం 312.04 టీఎంసీలగా ఉంది.

ఇదీ చదవండి:యూట్యూబ్​లో చూసి నాటుసారా తయారీ... యువ ఇంజినీరు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details