కర్నూలు జిల్లా నందవరం మండలంలోని మిట్టాసోమపురంలో విద్యుదాఘాతంతో రైతుతో పాటు ఎద్దు మృతిచెందింది. వరి నాటు వేసేందుకు పొలం దుక్కి దున్నుతుండగా ఎద్దు విద్యుదాఘాతానికి గురైంది. అది చూసిన రైతు సత్యన్న.. ఆ ఎద్దును కాపాడటానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు.
మిట్టాసోమపురంలో విషాదం..కరెంట్షాక్తో రైతు, ఎద్దు మృతి - మిట్టాసోమపురంలో ఎద్దును కాపాడబోయి రైతు మృతి
కళ్లముందే కరెంట్ షాక్కు గురై విలవిలలాడుతున్న ఎద్దును కాపాడబోయి రైతు ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లా నందవరం మండలంలోని మిట్టాసోమపురంలో జరిగింది.

మిట్టాసోమపురంలో విషాదం
పొలంలో ఉన్న విద్యుత్తు స్తంభం తీగలు తగిలి ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. యజామాని మరణించడంతో ...కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి.మమ్మల్ని రాజకీయంగా వేధిస్తున్నారు: మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు