ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కష్టపడి పండించిన పత్తి.. అగ్నికి ఆహుతి - kurnool dist latest news

ఓ రైతు కష్టపడి పండించిన పంటను ఇంటికి తెచ్చాడు. ఓ గదిలో నిల్వ ఉంచాడు. ఒక్కసారిగా గదిలో మంటలు వ్యాపించాయి. పంటంతా బూడిదైంది. ఆ రైతు కష్టమంతా అగ్నికి ఆహుతి అయ్యింది. అతనికి నష్టాన్ని మిగిల్చింది.

The cotton was burnt
కష్టపడి పండించిన పత్తి

By

Published : Nov 28, 2020, 5:52 PM IST

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేములలో విద్యుదాఘాతం వల్ల పత్తి కాలిపోయింది. నాగరాజు అనే రైతు 6 ఎకరాల్లో పత్తిని పండించాడు. పంటను తీయించి ఇంట్లోని ఓ గదిలో నిల్వ ఉంచాడు. పత్తి ఉన్న గదిలో విద్యుదాఘాతం జరిగి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

ఈ కారణంగా.. గదిలో ఉన్న పత్తి పూర్తిగా బూడిదయ్యింది. ఇంటిలోని మిగతా సామగ్రి సైతం దాదాపుగా కాలిపోయింది. దగ్ధమైన పత్తి సుమారు 15 క్వింటాళ్లు ఉంటుదని, అంతా నష్టపోయానని రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details