కరోనా వైరస్ వ్యాప్తి, స్థానిక పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రానికి వచ్చాయి. కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్లో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డితో బృంద సభ్యులు భేటీ అయ్యారు. కాసేపట్లో గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్ర బృందాలకు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర కరోనా బృందంలో కృష్ణా జిల్లాలో డాక్టర్ వివేక్ అధిష్, డాక్టర్ రుశి గైలాంగ్ పర్యటించనున్నారు. కర్నూలు జిల్లాకు డాక్టర్ సంజయ్ సాధు, డాక్టర్ ఎం.డోబె.. గుంటూరు జిల్లాకు డాక్టర్ బాబీ పాల్, డాక్టర్ నందిని భట్టాచార్య వెళ్లనున్నారు.
ఆ మూడు జిల్లాల్లో కేంద్ర బృందాల పర్యటన - ఏపీలో కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న కృష్ణా, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. అక్కడి స్థానిక పరిస్థితులను అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నాయి.
The central team will visit 3 districts in the state