చిత్తూరు నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు పాణ్యం మండలం తమ్మరాజుపల్లె సమీపంలోని ఘాట్ రోడ్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు అదుపు తప్పి డివైడర్ను దాటి అవతల వైపున కల్వర్టు గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న పాణ్యం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి.. బస్సులో ఉన్న ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, ఒక ప్రయాణికురాలికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు.
పాణ్యంలో బస్సు బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో పెను ప్రమాదం తప్పింది. తమ్మరాజుపల్లె ఘాట్ లో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి తీవ్రగాయలు కాకపోవడం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పాణ్యంలో బస్సు బోల్తా