జిల్లాకు హైకోర్టును ప్రకటించినందుకు కర్నూలులో విద్యార్థులు థాంక్యూ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్ల నుంచి అధిక సంఖ్యలో కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని... ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు హాఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. తెదేపా నాయకులు కర్నూలుకు హైకోర్టు ఇవ్వడంపై స్పందించకపోవడం సరి కాదన్నారు.
కర్నూలులో "థాంక్యూ సీఎం" కార్యక్రమం - కర్నూలులో థాంక్యూ సీఎం కార్యక్రమం తాజా వార్తలు
కర్నూలులో థాంక్యూ సీఎం కార్యక్రమం నిర్వహించారు. జిల్లాకు హైకోర్టు ప్రకటించినందుకు కృతజ్ఞతగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేశారు.
కర్నూలులో "థాంక్యూ సీఎం" కార్యక్రమం