ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని మార్పును స్వాగతిస్తాం: టీజీ వెంకటేశ్ - AMARAVATHI

రాజధాని మార్పుపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని టీజీ వెంకటేశ్ అన్నారు. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని.. వైకాపా ప్రభుత్వం నిర్ణయానికొచ్చిందని తెలిపారు. అంతేకాకుండా మరెన్నో విషయాలను ఆయన ఈటీవీభారత్​తో పంచుకున్నారు.

టీజీ వెంకటేశ్

By

Published : Aug 25, 2019, 7:07 PM IST

రాజధానిగా అమరావతి ఉండకపోవచ్చని దిల్లీ పెద్దలతో జగన్ అన్నారని భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్ తెలిపారు. 4 ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయబోతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రణాళిక రద్దు, నాలుగు చోట్ల ప్రాంతీయ ప్రణాళిక సంఘాలు ఏర్పాటు, వాటికి ఉప ముఖ్యమంత్రుల నియామకం వంటివి ఇందులో భాగమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదేనని ఆయన పేర్కొన్నారు. అలాగే కర్నూలును రాజధానిగా చేస్తే ఆనందిస్తామని చెప్పారు.

కేసీఆర్​తో ఎవరు పెట్టుకున్న నాశనం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​పైనా టీజీ వెంకటేశ్ విమర్శలు చేశారు. ఆయనతో పెట్టుకున్న వారు నాశనం అవుతారని విమర్శించారు. గోదావరి జలాలను శ్రీశైలానికి ఇస్తామనడం హాస్యాస్పదం అని అన్నారు. కేసీఆర్​కి ఏపీపై నిజంగా ప్రేమ ఉంటే విభజన లెక్కలను ఎందుకు పెండింగ్​లో ఉంచేవారని పేర్కొన్నారు.

ఎంపీ టీజీ వెంకటేశ్​తో ముఖాముఖి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details