రాజకీయాల్లో శాశ్వత మిత్రులు... శత్రువులు ఉండరని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. అవసరం అనుకుంటే వైకాపా, భాజపా కలిసిపోతాయని ఆయన చెప్పారు. ఎన్డీయేలో చేరికపై బొత్స సత్యనారాయణ మాట్లాడారంటే... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి సంకేతాలు వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో వైకాపా ఘన విజయానికి భాజపా కూడా కారణమని టీజీ స్పష్టం చేశారు.
'సీఎం జగన్ సంకేతాలిస్తేనే బొత్స ఆ వ్యాఖ్యలు చేశారు' - ఎన్డీయేలో వైకాపా చేరిక
రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్డీయేలో చేరే అంశాన్ని పరిశీలిస్తామని... రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్ స్పందించారు. రెండు పార్టీల కలయికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

TG Venkatesh interesting comments on ycp to join in NDA
మీడియాతో భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్