హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.వారికి రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ సంఘీభావం తెలిపారు.గతంలో కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినా అది ఇప్పటివరకు అమలు కాలేదన్నారు.ఇప్పటికైనా హైకోర్టును ఇక్కడ ఏర్పాటు చేసి రెండవ రాజధానిగా కర్నూలు ప్రకటించాలని టీజీ కోరారు.రాయలసీమ లో పరిశ్రమలు పెట్టేందుకు పెట్టుబడుదారులు ముందుకొస్తుంటే..వారిని కొంత మంది అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
హైకోర్టు కోసం కర్నూలులో న్యాయవాదుల రిలే నిరహార దీక్షలు - న్యాయవాదుల రిలే నిరహార దీక్షలు
కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయమంటూ, న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. న్యాయవాదుల దీక్షకు ఎంపీ సభ్యులు టీజీ వెంకటేష్ మద్దతు పలికారు.
టీజీ వెంకటేష్ సంఘీభావం