ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు: పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్తత.. ఎస్సైపై కారంపొడి చల్లిన మహిళలు! - కర్నూలు క్రైమ్ న్యూస్

కర్నూలు: పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్తత.. ఎస్సైపై కారంపొడి చల్లిన మహిళలు!
కర్నూలు: పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్తత.. ఎస్సైపై కారంపొడి చల్లిన మహిళలు!

By

Published : May 25, 2021, 12:24 PM IST

Updated : May 25, 2021, 12:59 PM IST

12:17 May 25

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల పగిడిరాయికి చెందిన బాలిక అదృశ్యమైంది. ఈ కేసును ఛేదించిన పోలీసులు.. రాత్రి జొన్నగిరి పోలీస్ స్టేషన్ కు బాలికను తీసుకువచ్చారు. బాలికను చూపించాలని పెద్దఎత్తున పోలీస్ స్టేషన్ కు బంధువులు వెళ్లారు. ఎస్సై సురేష్ తమతో దురుసుగా ప్రవర్తించినట్లు బంధువులు చెబుతున్నారు. అయితే అనంతరం పగిడిరాయికి వెళ్లిన ఎస్సైపై మహిళలు కారంపొడి చల్లారు. ఈ ఘటనతో అర్ధరాత్రి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు.

ఇదీ చదవండి:సీలేరు నదిలో ఎనిమిది మంది గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం!

Last Updated : May 25, 2021, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details