కర్నూలు జిల్లా గూడూరు మండలంలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులను మండల విద్యా వనరుల కేంద్రం ముందు అధికారులు అంటించారు.
కొద్ది సేపటి తర్వాత గుర్తులపై పేపర్ అంటించడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఈ ఘటనపై అధికారులను సంప్రదించగా... గ్రామ సచివాలయాల్లో అభ్యర్థుల గుర్తులను అతికిస్తామని అధికారులు తెలిపారు. ఇతర మండలాల్లో అభ్యర్థులకు గుర్తులు ప్రకటించి, గూడూరు మండలంలోనే ఇలా జరగడతో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.