ఎన్నికల సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు(ఎఫ్ఎస్టీ), పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పట్టణ శివారులోని బైపాస్ రహదారి వద్ద కారులో పది లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాయచూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న వ్యక్తి ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ మొత్తాన్ని తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆదోని సీఐ చంద్రశేఖర్ చెప్పారు.
వాహన తనిఖీల్లో రూ.10 లక్షలు స్వాధీనం - vehicle inspection news
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో ఎఫ్ఎస్టీ, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పది లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
వాహన తనిఖీలు