శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో 4,01,818 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4,96,497 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 883.80 అడుగులు ఉండగా... నీటి నిల్వ 208.72 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ అదనంగా 26 వేల 677 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణ్‌పూర్, జూరాలకు తాకిడి కొనసాగటంతో... మరికొన్నిరోజులపాటు శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి... 10గేట్లు ఎత్తివేత - శ్రీశైలం జలాశయం వార్తలు
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 10గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరికొన్ని రోజులు జలాశయానికి వరద తాకిడి కొనసాగనుందని అధికారులు తెలిపారు.
![శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి... 10గేట్లు ఎత్తివేత ten gates lifted in srisailam reservoir to release flood water](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9240136-239-9240136-1603163918409.jpg)
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి... 10గేట్లు ఎత్తివేత