కర్నూలు జిల్లా కోడుమూరు మండలం రామాపురం ప్రాథమిక పాఠశాల రెండేళ్ల క్రితం శిథిలావస్థకు చేరింది. విద్యార్థుల చదువు మధ్యలో నిలిచిపోకూడదనే ఉద్దేశంతో గ్రామస్థులు.. స్థానిక రామాలయంలో పాఠశాల కొనసాగించాలని నిర్ణయించారు. అప్పటినుంచి పిల్లల చదువు, ఆటలన్నీ దేవాలయంలోనే సాగుతున్నాయి. దీంతో గుడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థులకూ అదే పరిస్థితి. పాఠశాలను పునర్నిర్మించాలని మండల విద్యాధికారికి వినతిపత్రం ఇచ్చామని గ్రామస్థులు చెప్తున్నారు. బడిని త్వరగా నిర్మించి విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టాలని కోరుతున్నారు.
గుడిలోనే బడి.. భక్తుల మధ్యలోనే చదువు
పాఠశాల అంటే.. బలమైన భవనాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, పిల్లలు చదువుకోడానికి కావాల్సిన అన్ని వసతులు ఉండాలి. అయితే అక్కడ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. భవనాలు కాదు.. అసలు బడే లేదు. శిథిలావస్థకు చేరిన ఆ పాఠశాల కూలిపోయింది. ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో స్థానిక రామాలయంలోనే విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు.
రామాపురంలో గుడే బడి