ఆలయాల్లో చోరీ.. పొలాల్లో హుండీలు - temple
ఒకేసారి రెండు ఆలయాల్లో చోరీ జరిగిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. హుండీల్లోని నగదు, కానుకలు ఎత్తుకెళ్లి , ఖాళీ హుండీలను ఊరు చివర పొలాల్లో పడేశారు.
కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని కొండ జూటూరు గ్రామంలో రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. గుడిలో హుండీలను దుండగులు ఎత్తుకెళ్లారు. గ్రామంలోని గంగాదేవి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం హుండీలను సమీపంలోని పొలాల్లోకి ఎత్తుకెళ్లి పగల కొట్టారు. భక్తులు సమర్పించిన కానుకలు, నగదును స్వాహా చేశారు. పొలంలో పడి ఉన్న హుండీలను గమనించిన గ్రామస్ధులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ రాకేష్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఒకే రోజు రెండు ఆలయాల్లో దొంగతనం జరగడంతో గ్రామస్ధులు భయాందోళనకు గురయ్యారు. సంవత్సరం కింద గంగాదేవి ఆలయంలోని హుండీని ఇదే విధంగా ఎత్తుకెళ్లారు దుండగులు.