కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం పాత కందుకూరు గ్రామంలో కాళీకామాత ఆలయాన్ని... భక్తులు కేవలం 12 గంటల వ్యవధిలోనే నిర్మించారు. గ్రామ శివారులోని భైరవ స్వామి ఆలయం పక్కన ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. భైరవ స్వామి ఆలయ ధర్మకర్త లక్ష్మీనరసింహశాస్త్రి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. శక్తి పీఠాన్ని కేవలం 12 గంటల్లో నిర్మిస్తే అమ్మవారి ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ గ్రామస్థులు 12 గంటల్లో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. కావలసిన శిల్పాలు, రాళ్లను... నిర్మాణానికి ముందే సిద్ధం చేసుకున్నారు. అవసరమైన చోట పెద్ద పెద్ద యంత్రాలనూ వినియోగించారు.
కాళీమాత ఆలయ నిర్మాణం@12 గంటలే! - temple constructed in 12 hours
దేవాలయం కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది. అందంగా తీర్చిదిద్దితే.. ఏళ్ల సమయం కూడా పట్టొచ్చు. కొంతమంది భక్తులు మాత్రం కేవలం 12 గంటల్లోనే కాళిమాత ఆలయం కట్టేశారు తెలుసా.
ఈ భక్తులు 12 గంటల్లో గుడి కట్టారు