ప్రశ్నించినందుకే అర్చకులను కొట్టారు..!
13:36 November 30
ఉచిత దర్శనానికి టికెట్ రుసుము ఎందుకు తీసుకుంటున్నారని అడిగినందుకు ఆలయ అర్చకులపై ఛైర్మన్ దాడి చేశాడు. మరో ఇద్దరితో కలిసి కట్టెతో అర్చకులను చితక బాదాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార క్షేత్రంలో జరిగింది.
పూజాదికాలు నిర్వహించే అర్చకులపై సాక్షాత్తు ఆలయ ఛైర్మన్ దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార క్షేత్రంలో ఉచిత దర్శనానికి బదులు టికెట్ రుసుము ఎందుకు వసూలు చేస్తున్నారని అర్చకులు సుధాకర్, చక్రపాణి ప్రశ్నించారు. మీకు సంబంధం లేని వ్యవహారంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహించిన ఆలయ ఛైర్మన్ ప్రతాప రెడ్డి కట్టెతో వీపుపై చితక బాదారు. దాడి చేసిన వారిలో ఆలయ ఛైర్మన్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారన్న అర్చకులు... కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై ఆలయ ఈవో మోహన్‌కు అర్చకులు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి. ఓ నాయకా..నిధి నీ విధి!