విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మారుస్తున్న వీసీలపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని... తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీరాం డిమాండ్ చేశారు. కొందరు వీసీలు సీఎం జగన్ మెప్పు కోసం తమ హక్కులను మరిచి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యలు విద్యార్థి లోకాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ శ్యామ్‌ప్రసాద్ కర్నూలు వైద్య కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో జగనే మళ్లీ సీఎం అవుతారని చెప్పడం విద్యార్థులను కలచివేసిందన్నారు. రాజకీయాలపై అంత వ్యామోహం ఉంటే వైకాపాలో చేరి భజన చేసుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ అధికారపక్ష నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ... విద్యార్థులకు ద్రోహం చేయవద్దని కోరారు. ముఖ్యమంత్రి జగన్ అజెండా అమలు చేసేవారిని వీసీలుగా నియమించారా అని ధ్వజమెత్తారు.
'జగన్ మెప్పు కోసం వీసీలు తమ హక్కులను మరుస్తున్నారు' - Telugu Yuvath Latest news
కొందరు వీసీలు సీఎం జగన్ మెప్పు కోసం తమ హక్కులను మరిచి ప్రవర్తిస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీరాం ఆరోపించారు. అంత వ్యామోహం ఉంటే వైకాపాలో చేరి భజన చేసుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
'జగన్ మెప్పు కోసం వీసీలు తమ హక్కులను మరుస్తున్నారు'