తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.. శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శనానంతరం మంత్రి సత్యవతి రాథోడ్ విలేకరులతో మాట్లాడారు. తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మరింత శక్తిని ఇవ్వాలని శ్రీ స్వామి అమ్మవార్లను వేడుకున్నట్లు ఆమె తెలిపారు.
శ్రీశైల మల్లికార్జునుని సన్నిధిలో తెలంగాణ మంత్రి - శ్రీశైల మల్లికార్జునుని దర్శించుకున్న సత్యవతి రాథోడ్
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల తెలుగు రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదని అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ను భాజపా.. ఎన్నికలే లక్ష్యంగా ప్రవేశపెట్టినట్లు కనిపిస్తోందని విమర్శించారు. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టం హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని తాను తెలుగు బిడ్డగా కోరుతున్నట్లు చెప్పారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ..భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు.. స్వామివారి సేవలో ప్రముఖులు