ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాల నుంచి తెలంగాణ విద్యార్థుల తరలింపు - kurnool dst corona news

కర్నూలు జిల్లా నంద్యాలలో తెలంగాణకు చెందిన 610 మంది బ్యాంకు కోచింగ్ విద్యార్ధులను అధికారులు వారి స్వస్థలాలకు పంపించారు. పరీక్షల శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులు లాక్​డౌన్​ సందర్భంగా నంద్యాలలోనే ఉండి పోయారు.

telangana students  return to their own place from kurnool nandhyala
telangana students return to their own place from kurnool nandhyala

By

Published : May 4, 2020, 11:31 PM IST

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలో ఉన్న వలస కూలీలను, వేరే రాష్ట్ర విద్యార్థులను అధికారులు వారి స్వస్థలాలకు పంపుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఇరుక్కుపోయిన 610 మంది తెలంగాణ విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపించారు. తాము పడుతున్న ఇబ్బందులను విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి , తెలంగాణ నాయకురాలు కవిత దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రెండు ప్రభుత్వాలు స్పందించి విద్యార్థులు తెలంగాణ వెళ్లేందుకు మార్గం సుగమం చేశాయి. ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో వారిని తెలంగాణకు పంపించినట్లు నంద్యాల ఆర్డీవో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details