ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టమాటాలతో పాటు మద్యం రవాణా..పట్టుకున్న పోలీసులు - telangana liquor seized in kurnool news

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కర్నూలు జిల్లా పంచలింగాల వద్ద ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి మద్యం సీసాలను​, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

liquor seized
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం

By

Published : Nov 28, 2020, 10:07 AM IST

రాష్ట్రానికి తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. కర్నూలు జిల్లా పంచలింగాల వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించారు. చిన్న ట్రాలీలో టమాటాలతో పాటు తరలిస్తున్న44 బాక్సుల్లోని 2,027 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పత్తికొండ మండలం చక్రాల గ్రామానికి చెందిన ఒకరు, తుగ్గలి మండలం శభాష్​పురానికి చెందిన మరొకరిని అరెస్టు చేశామని చెప్పారు. వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details