కర్నూలు జిల్లా గూడూరు మండలం ఆర్. ఖానాపురం దగ్గర... ద్విచక్రవాహనాలపై అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. క్యాన్లలో మద్యం సీసాలను ఉంచి తరలిస్తున్నారని ఎస్ఐ శంకర్ తెలిపారు. గూడూరు చెందిన వ్యక్తి... తెలంగాణకు చెందిన ముగ్గరికి.. ఈ విషయంలో పేటియం ద్వారా డబ్బులు పంపినట్లు చెప్పారు.
146 మద్యం సీసాలను, రెండు ద్విచక్ర వాహనాలను, ఒక చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణకు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గూడూరు చెందిన మరో ఇద్దరిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్సై వివరించారు.