తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం వేకువజామున ఆళ్లగడ్డ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై రామిరెడ్డి వాహనాలను తనఖీ చేస్తుండగా... లారీలో 72 మద్యం సీసాలను గుర్తించారు. వీటి విలువ లక్ష రూపాయలు ఉంటుందని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. అక్రమ మద్యం రవాణాపై గట్టి నిఘా ఉంచామన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
ఆళ్లగడ్డ పోలీసుల తనిఖీలో తెలంగాణ మద్యం పట్టివేత - telangana liquor caught in allagadda latest news
ఆళ్లగడ్డ పోలీసులు లారీలో తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 72 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
ఆళ్లగడ్డలో తెలంగాణ మద్యం పట్టివేత