కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ప్రజాసేవలో పాల్గొన్న వారికి తమవంతుగా ఉపాధ్యాయలు తోడ్పాటు అందిస్తున్నారు. ఆళ్లగడ్డ పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం సభ్యులు... పోలీసు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి ఆహారం అందించారు. ఉపాధ్యాయులు స్వయంగా ఆహారాన్ని సిద్ధం చేసి పొట్లాలు కట్టి మూడు పూటలా సహాయక సిబ్బంది సరఫరా చేశారు. కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్న కేంద్రానికీ వెళ్లి వారికి ఆహారం అందించారు. ఉపాధ్యాయులు చేస్తున్న సేవలను స్థానికులు కొనియాడుతున్నారు.
లాక్డౌన్: సేవకుల 'సేవ'లో ఉపాధ్యాయులు - kurnool district
లాక్డౌన్ నేపథ్యంలో... ప్రజాసేవలో మేము సైతం అంటూ ఉపాధ్యాయులు ముందుకు వచ్చారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పోలీసు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి ఆహారం అందించారు.
కరోనా సేవలకు తాము సైతం అంటున్న ఉపాధ్యాయులు