కర్నూలు జిల్లా నంద్యాలలో విజయరాణి అనే ఉపాధ్యాయురాలు ధర్నాచేశారు. ఎస్పీజీ, సీఎస్ఐ ఎయిడెడ్ పాఠశాలల్లో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. అర్హత ఉన్నా పదోన్నతిలో పాఠశాల యాజమాన్యం తనకు అన్యాయం చేస్తోందని నిరసన తెలిపారు. నిరాధారమైన ఆరోపణలతో షోకాజ్ నోటీసులు ఇచ్చి మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బిషప్ తనను సహోద్యోగుల ముందు బెదిరించి ప్రమోషన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. పదోన్నతితో పాటు నంద్యాలలో పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బహుజన టీచర్స్ ఫెడరేషన్ నాయకులు బాధితురాలికి మద్దతుగా నిలిచారు. విజయరాణికి న్యాయం చేయాలని కోరారు.
అర్హత ఉన్నా పదోన్నతిని అడ్డుకుంటున్నారు: ఉపాధ్యాయురాలి ఆవేదన - Teacher protests for promotion in Kurnool district
అన్ని అర్హతలు ఉన్నా తనకు పదోన్నతి కల్పించడం లేదంటూ ఓ ఉపాధ్యాయురాలు ధర్నాకు దిగారు. ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యం నిరాధారమైన ఆరోపణలు మోపి మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి బహుజన టీచర్స్ ఫెడరేషన్ మద్దతు తెలిపింది.
ఉపాధ్యాయురాలి ఆవేదన
TAGGED:
dharna teacher