ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో రాయలసీమ గర్జన.. అధికార, విపక్షాల మాటల పోరు

Rayalseema Gharjana ఈనెల 5వ తేదీన కర్నూలులో రాయససీమ గర్జనను నిర్వహించాలని అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. దీనికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. మరోవైపు ఈ గర్జన ఎందుకోసమో అర్థం కావటం లేదని టీడీపీ నేతలు అంటున్నారు.

tdp ysrcp leaders
వైసీపీ టీడీపీ నేతలు

By

Published : Dec 4, 2022, 3:07 PM IST

Rayalseema Gharjana: కర్నూలులో ఈనెల 5న నిర్వహించనున్న రాయలసీమ గర్జనకు హాజరుకానివారు సీమ ద్రోహులుగా మిగిలిపోతారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వ్యాఖ్యానించారు. ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించే సభకు వైసీపీ మద్దతిస్తోందని తెలిపారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బుగ్గన తెలిపారు. రాయలసీమ అభివృద్ధిపై ఈ సభలో చర్చిస్తామని స్పష్టం చేశారు. రాయలసీమకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే అన్ని పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని అన్నారు. ముందు తరాల భవిష్యత్ ​కోసం మాతో కలిసి రావాలని అన్నారు. మరోవైపు మూడు రాజధానుల పేరు చెప్పి వైసీపీ మోసానికి పాల్పడుతోందని తెలుగుదేశం ఆరోపించింది. కర్నూలుకు హైకోర్టు తీసుకువస్తామంటే ఎవరూ కాదన్నారని.. అధికారంలో ఉండి కూడా ఎందుకు తీసుకురాలేకపోతున్నారని టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. విభజన సమస్యలపై కేంద్రంపై పోరాడితే తాము మద్దతిస్తామని అన్నారు.

కర్నూలులో రాయలసీమ గర్జన.. ఏర్పాటుపై అధికార, విపక్షాల వ్యాఖ్యలు

"రాయలసీమ వాసులైతే సీమ భవిష్యత్ కోసం, పిల్లల భవిష్యత్​పై మీకు ఆలోచన ఉంటే మీరు కూడా మాతో కలిసి రండి. ఈ రాయలసీమ గర్జనకు ఏదైనా రాజకీయ పార్టీ రాలేదంటే వారు రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేసిన వారు అవుతారు. రానివారికి అధికారం, ఎన్నికలే ముఖ్యమని ప్రాంతం పైన ఏమాత్రం శ్రద్ధ లేదని భావిస్తున్నాము."- బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి, రాష్ట్ర మంత్రి

ఎవరి పేరు మీద సీమ గర్జన పెడుతున్నారు. అర్థం కావటం లేదు. రాయలసీమలోని విద్యార్థులను ఈ గర్జనకు తరలించాలని చూస్తున్నారు. విద్యార్థులకు ఈ కార్యక్రమానికి ఏమిటి సంబంధం. హైకోర్టు వద్దని ఏ ప్రతిపక్ష పార్టీ చెప్పదు. ప్రకటించింది, నిర్మిస్తానని చెప్పింది ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి. నిర్మించే అధికారం ఆయన దగ్గర ఉంది. ఇవన్నీ ఆయన దగ్గర పెట్టుకుని ప్రతిపక్షాలపైన పడితే ఎలా." - సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ నేత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details