కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం గొడిగనూరు గ్రామంలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. తాజాగా గ్రామంలో విద్యుత్ తీగలు ఏర్పాటు విషయంలో ఇరు పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఈ దాడుల్లో ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
గత రెండు సంవత్సరాలుగా ఈ గ్రామంలో స్వల్ప వివాదాలకే గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల వైకాపా నాయకుల ఇసుక అక్రమ నిల్వలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దీని వెనుక తెదేపా నాయకుల హస్తం ఉందని భావించి వైకాపా నాయకులు ఈ దాడులకు దిగినట్లు తెలుస్తోంది.