ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులు ఆనందంగా ఉన్నారని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందన్న తెదేపా - గిట్టుబాట ధర

Farmers difficulties పండించిన పంటలకు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులను తెదేపా నేత బీవీ జయనాగేశ్వర రెడ్డి పరామర్శించారు. కర్నూలు జిల్లాలో రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఓవైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం రైతులు సంతోషంగా ఉన్నారని దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

తెదేపా ఉపాధ్యక్షుడు
తెదేపా ఉపాధ్యక్షుడు

By

Published : Aug 26, 2022, 9:12 PM IST

Farmers difficulties: పండించిన పంటలకు ధరలు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పండించిన పంటలు అమ్మితే కనీసం కూలీలకు వెచ్చించిన ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని ఉల్లి, టమాట రైతులు గిట్టుబాట ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులను తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పరామర్శించారు. ఉల్లి, టమాట పంటలకు ధర లేక అప్పుల పాలైనట్లు రైతులు గోడు వెలిబుచ్చారు. పంట పండించటానికి పెట్టుబడి ఖర్చులు, రైతు కూలీల ఖర్చులు, మార్కెట్​కు తరలించడానికి రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతుండగా.. అమ్మితే కూలీలకు వెచ్చించిన నగదు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రైతు భరోసా, పావలా వడ్డీ రుణాలు కాదని.. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరారు.

రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. కూలీలకు గిట్టుబాటు ధర లేక కొట్టుమిట్టాడుతుంటే.. సీఎం మాత్రం రైతులు ఆనందంగా ఉన్నారని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేకతను అడ్డుకోలేక పనికిమాలిన పనులు చేస్తున్నారని అన్నారు. ప్రజలను పట్టించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కుప్పంలో వైకాపా శ్రేణులు అడ్డుకోవడం, అన్న క్యాంటీన్​ను ధ్వంసం చేయడం దారుణమని అన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details