హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా రేపటినుంచి కర్నూలు జిల్లాలో వారం రోజుల పాటు నిరసనలు చేపట్టనున్నట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయని... ఎవరు ఏ దేవుడినైనా ప్రార్థించడం హక్కు అని గుర్తు చేశారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం కాలిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా వారం రోజులపాటు నిరసనలు చేపడుతున్నట్లు వివరించారు.
'జిల్లావ్యాప్తంగా వారం రోజులు నిరసన కార్యక్రమాలు' - కర్నూలులో తెదేపా నిరసనలు వార్తలు
అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ఘటనకు నిరసనగా రేపటినుంచి వారం రోజుల పాటు కర్నూలు జిల్లాలో నిరసనలు చేపట్టనున్నట్టు... తెదేపా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు చెప్పారు. హిందూ దేవాలయాలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
!['జిల్లావ్యాప్తంగా వారం రోజులు నిరసన కార్యక్రమాలు' TDP to protest for one week over Antarvedi Incident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8775725-686-8775725-1599905108235.jpg)
తెదేపా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు