రాజధాని రైతులకు సంకెళ్లు వేయడాన్ని ఖండిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెలుగుదేశం నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజధాని రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లడం దుర్మార్గ చర్య అని ఆయన మండిపడ్డారు.
'రైతులకు సంకెళ్లు వేయడం దుర్మార్గపు చర్య' - కర్నూలు జిల్లా తాజా వార్తలు
రాజధాని రైతులకు సంకెళ్లు వేయడాన్ని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఖండించారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు పట్టణంలో తెదేపా కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన చేపట్టారు.
!['రైతులకు సంకెళ్లు వేయడం దుర్మార్గపు చర్య' ex mla jaya nageswara reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9380314-538-9380314-1604141696860.jpg)
ex mla jaya nageswara reddy