ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్ డీలర్లను కొనసాగించాలని.. తెదేపా ఆందోళన - కర్నూలు జిల్లా

రేషన్ డీలర్లను కొనసాగించాలని కోరుతూ తెదేపా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిరసన ప్రదర్శన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ... తెదేపా ఆందోళన

By

Published : Jul 31, 2019, 5:29 PM IST

ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ... తెదేపా ఆందోళన

వైకాపా అధికారం చేపట్టిన తర్వాత గత రేషన్ డీలర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా వర్కర్లు, ఐకేపీ యానిమేటర్లు, ఈజీఎస్ క్షేత్రసహాయకులు ఇబ్బందులు పడుతున్నారని తెదేపా నేత కోట్ల సుజాతమ్మ ఆరోపించారు. ఏళ్లతరబడి పనిచేస్తున్నవారిని తొలగించి... వైకాపా సానుభూతిపరులకు అప్పగించాలని చూస్తున్నారన్నారు. తక్కువ జీతాలు ఉన్నప్పటినుంచి సేవలందించారని... అలాంటి వారిని తొలగించడం దురదృష్టకరమని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా... రేషన్ బియ్యం పంపిణీ చేస్తోన్న డీలర్లను... మంత్రి చెప్పారని తొలగించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించాలని అధికారులను కోరారు. జిల్లాలో వెనుకబడిన ఆలూరు అభివృద్ధికి మంత్రి కృషిచేయాల్సింది పోయి... ఇలాంటి పనులకు పూనుకోవడం తగదన్నారు.

ABOUT THE AUTHOR

...view details