ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇంత విచిత్రమైన నాయకుడిని ఎప్పుడూ చూడలేదు' - కర్నూలులో చంద్రబాబు పర్యటన వార్తలు

కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించబోమని.. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఏం చేశారని ప్రశ్నించారు. కర్నూలులో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

tdp president chandrababu naidu in kurnool tour
కర్నూలు పర్యటనలో చంద్రబాబు

By

Published : Dec 2, 2019, 4:22 PM IST

అధినేత చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కర్నూలులో తెదేపా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇన్నేళ్లలో జగన్​ అంత విచిత్రమైన నాయకుడిని చూడలేదని ఎద్దేవా చేశారు. తమ నేతలు, కార్యకర్తలపై కూర్చుంటే కేసు, నిలబడితే కేసులు పెడుతున్నారని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి ఉంటే మీ పార్టీ ఉండేదా అని ప్రశ్నించారు.

6 నెలల్లో ఏం చేశారు
కోడికత్తి కేసును 6 నెలల్లో ఏం చేశారని చంద్రబాబు నిలదీశారు. బాబాయి హత్యకేసులో ఏం పురోగతి సాధించారని ప్రశ్నించారు. ట్రాక్టర్ ఇసుక రూ.4 వేలు, లారీ ఇసుక రూ.10 వేలు చేశారని మండిపడ్డారు. ఇసుక విధానాన్ని ఎందుకు మార్చారనీ.. దీనివల్ల 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. కర్నూలు ఇసుకను బెంగళూరు, హైదరాబాద్​కు తరలిస్తున్నారని ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు మాఫియాలా మారారని ధ్వజమెత్తారు.

తెలంగాణలో జరిగిన పశువైద్యురాలి హత్యపై స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. 'దిశ'ను దారుణంగా చంపేశారనీ... అలాంటి మానవ మృగాలకు ఉరిశిక్ష వేయాలన్నారు.

కర్నూలు పర్యటనలో చంద్రబాబు

ఇవీ చదవండి..

సచివాలయ ఉద్యోగులకు నైట్​షిప్టులు.. రానందుకు మెమోలు..!

ABOUT THE AUTHOR

...view details